
654views
సింగపూర్: మనిషి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్ ఆనవాళ్లను పట్టేసే విధంగా వినూత్నమైన యాంటిజెన్ రాపిడ్ టెస్ట్‌ని సింగపూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కొవిడ్-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తిస్తుందని చెబుతున్నారు. దీనికి ‘ప్యార్లల్ యాంప్లిఫైడ్ సెలైవా, ర్యాపిడ్ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్’ (పాస్‌పోర్ట్) అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇతర ఏఆర్‌టీ పరీక్షల కన్నా చాలా మెరుగైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రామాణిక పాలీమరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) పరీక్షలకు ఏ మాత్రం తీసిపోదని వివరించారు.
Source: EtvBharat





