News

విద్యార్థుల చొక్కాల‌కు ‘నేను బాబ్రీ’ బ్యాడ్జీ!

716views
  • పీ.ఎఫ్‌.ఐ కార్య‌క‌ర్త‌ల నీతిమాలిన చ‌ర్య‌

  • మండిప‌డ్డ త‌ల్లిదండ్రులు, కేర‌ళ‌లో ఘ‌ట‌న‌

  • హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు

తిరువ‌నంత‌పురం: కేర‌ళలో స్థానిక పీ.ఎఫ్‌.ఐ కార్య‌క‌ర్త‌లు నీతిమాలిన చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. పాఠ‌శాల‌ల‌కు వెళ్ళే విద్యార్థినివిద్యార్థుల చొక్కాల‌కు బ‌ల‌వంతంగా ‘నేను బాబ్రీ’ అని రాసివున్న బ్యాడ్జీని పిన్ చేశారు. దీంతో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘ‌ట‌న పతనంతిట్ట జిల్లాలో చోటుచేసుకుంది. ఈ చర్యపై బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ మండిపడ్డారు. కేరళ ప్రభుత్వం దోషులపై చర్యలు తీసుకోదని అన్నారు. కేరళ వేగంగా సిరియాగా మారుతుందా అని ప్రశ్నించారు. హోం మంత్రిత్వ శాఖ, ఎన్‌.సీ.పీ.సీ.ఆర్‌కి ఫిర్యాదులు అందాయి. ఇస్లాంవాదుల చ‌ర్య‌పై ప‌లువురు దుమ్మెత్తిపోస్తున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి