
634views
-
అవయవ మార్పిడి చేయించుకున్న వారికి అండగా కొత్త పరిజ్ఞానం
-
రూపొందించిన కేరళ వైద్యులు
తిరువనంతపురం: అవయవ మార్పిడి చేయించుకున్న వారి చికిత్సల్లో కేరళలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తల కొత్త ప్రక్రియను కనుగొన్నారు. రోగి జన్యుపరిణామక్రమాన్ని విశ్లేషించి, దాని ఆధారంగా ఔషధ మోతాదును కచ్చితంగా నిర్ధరించవచ్చని వీరు పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఇమ్యూనోసప్రసెంట్ ఔషధం టెక్రోలమస్ మోతాదుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి సమయంలో శరీర రోగనిరోధక శక్తిని తగ్గించడానికి ఈ ఔషధాన్నిస్తారు. ఇంతకుముందు సరైన మోతాదు నిర్ధరించేందుకు చాలా ప్రయోగాలు జరిగాయి. డీఎన్‌ఏ విశ్లేషణ ద్వారా మోతాదు ఎక్కువ ఇవ్వకుండా నిరోధించగలుగుతాం. ఇది చాలా మంది రోగులకు సాయపడుతుందని తెలిపారు.





