News

వ్యూహాన్ ల్యాబ్ వద్ద గుట్టలుగా శవాలు

549views
  • ట్రంప్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

వాషింగ్టిన్‌: చైనాలోని ‘వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఈ ల్యాబ్​ నుంచే వెలువడిందని తెలిపారు. కొవిడ్‌ మొదలైన తొలి నాళ్లలో వుహాన్‌లో బాడీ బ్యాగ్స్‌ కుప్పలు పడి ఉన్నట్టు ఫొటోలున్నాయని ట్రంప్​ చెప్పారు. అప్పటికే పరిస్థితి ఘోరంగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వుహాన్‌ వీధుల్లో ప్రజల మృతదేహాలు గుట్టలుగా పడి ఉన్నాయని ట్రంప్‌ వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి