
526views
పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను హతమార్చినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్ పరే ఉన్నట్టు వెల్లడించారు. ఐఈడీ అమర్చడంలో యాసిర్ సిద్ధహస్తుడన్నారు. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో వీరికి ప్రమేయం ఉన్నట్టు పేర్కొన్నారు.





