
520views
న్యూఢిల్లీ: కర్తార్‌పుర్ గురుద్వారా ఫొటోషూట్ ఘటనను భారత్ ఆక్షేపించింది. దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో ఆ దేశ తాత్కాలిక రాయబారికి సమన్లు జారీ చేసింది. ఈ చర్య గురుద్వారా పవిత్రతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. ఫొటోషూట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో నిజాయతీతో దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు.. గురుద్వారాలో ఫొటోషూట్‌పై పాక్ మోడల్ సులేహా క్షమాపణలు తెలిపింది. సిక్కుల మనోభావాలను దెబ్బతీయాలని తాను ఆ పని చేయలేదని పేర్కొంది.





