
417views
న్యూఢిల్లీ: ‘ఒమిక్రాన్’ అలజడితో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్ పరీక్షలను ముమ్మరంగా చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష (ఆర్‌ఏటీ)లకు చిక్కకుండా ఈ వేరియంట్ తప్పించుకోలేదని పేర్కొంది. ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వివిధ విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నవారిపై నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించింది.





