News

భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ

415views
  • ఆమోదించిన కేంద్రం

న్యూఢిల్లీ: భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు రూ. 2236 కోట్లతో ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీశాట్‌-7సీ ప్రత్యేక ఉపగ్ర‌హం, సంబంధిత సామగ్రిని ఐఏఎఫ్‌ సమకూర్చుకోనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఐఏఎఫ్‌ ఆధునికీకరణ, నిర్వహణ అవసరాలకు ‘భారత్‌లో తయారీ’ కింద ఈ సామాగ్రిని సమకూర్చుకోనున్నట్టు రక్షణ శాఖ ప్రకటనలో తెలిపింది. సాఫ్ట్​వేర్​-డిఫైన్డ్​ రేడియోల(ఎస్‌డీఆర్‌లు) గ్రౌండ్​ హబ్‌లు.. జీశాట్‌-7సీ ఉపగ్రహం పూర్తి డిజైన్‌, అభివృద్ధి ప్రయోగం వంటివి ఈ ప్రాజెక్టులో ఉన్నట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి