
625views
విజయవాడ: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ఊపిరితిత్తులలో సమస్య తలెత్తడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేశారు. గవర్నర్‌కు కరోనా సోకినట్టు నిర్ధారించారు. ఆయన వయస్సు 87 ఏళ్ళు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయనకు రెండు రోజులుగా దగ్గు, జలుబుతో అస్వస్థతకు గురయ్యారు. బిశ్వభూషణ్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు.
Source: Tv9





