న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను పీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2:45 గంటలకు ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
అర్జున్ సహాయక్ ప్రాజెక్ట్, రతౌలీ వీర్ ప్రాజెక్ట్, భయోని డ్యామ్ ప్రాజెక్ట్, మజ్‌గావ్-చిల్లీ స్ప్రింక్లర్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 3,250 కోట్లు కాగా, ఈ ప్రాజెక్టుల వల్ల మహోబా, హమీర్‌పూర్, బండ, లలిత్‌పూర్ జిల్లాల్లోని దాదాపు 65,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. తద్వారా లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందుతారు. ఈ ప్రాంతానికి మంచినీటి సమస్య కూడా తీరిపోతుందన్నారు.
Source: Tv9