News

న‌క్క వేషాలు మాన‌ని పాకిస్తాన్‌!

634views
  • సరిహద్దుల్లో డ్రోన్ కలకలం

  • కాల్పులు జరిపిన భార‌త‌ భద్రతా దళాలు

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల వెంబడి పాకిస్తాన్‌ డ్రోన్ తిర‌గ‌డాన్ని గుర్తించిన భద్రతా దళాలు దానిపై కాల్పులు జరిపాయి. దీంతో అవి పాక్​వైపు వెళ్లిపోయినట్టు అధికారులు వెల్ల‌డించారు. అమృత్​సర్​ జిల్లాలోని బిందీ సైదాన్ గ్రామంలో డ్రోన్​ను గుర్తించిన భద్రతా సిబ్బంది.. ఏమైనా పేలుడు పదార్థాలను కిందకు విడిచాయా? అన్నకోణంలో గాలింపు చర్యలు చేపట్టారు. గతంలోనూ పంజాబ్‌లోని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం రేపాయి. కొన్నినెలలుగా సరిహద్దుల్లో డ్రోన్​లు సంచరించటం వల్ల అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి