News

కాశీ వెళ్ళే తెలుగు యాత్రికులకు శుభవార్త

602views
  • వారణాసిలో క‌రివెన నాలుగో శాఖ ప్రారంభం

వారణాసి: పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలోని కరివెన సత్రం తెలుగు తీర్థ యాత్రికులకు ఉచిత భోజన వసతి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాశీలో నాలుగో శాఖ ఏర్పాటు చేసింది. కార్తీక మాసంలోని పవిత్ర ఏకాదశి రోజున యాగ హవ్‌ పూజతో పాటు ఈ భవనాన్ని భక్తులకు అందుబాటులోకి వచ్చింది.

120 ఏళ్ళ కిందట కరివెన గ్రామ ప్రజలు తమ శ్రీశైలం యాత్రికులకు భోజన ఏర్పాట్లు చేయడానికి ఈ సంస్థను స్థాపించారు. అదే క్రమంలో కాశీలో నూతన భవనానికి పూజలు నిర్వహించి భక్తులకు అంకితం చేశారు. ఈ సంస్థ ద్వారా 120 ఏళ్లుగా యాత్రికులకు ఉచిత ఆహార సేవలు అందజేస్తున్నారు. బ్రాహ్మణ సంఘంచే నిర్వహించబడుతున్నప్పటికీ, కుల, మతాలకు అతీతంగా అందరికీ భోజన వసతులు కల్పిస్తున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి