News

క‌ర్నూలు జిల్లాలో ఘోరం… గ‌ణ‌ప‌తి విగ్రహంపై దాడి!

1.4kviews

క‌ర్నూలు: ఏపీలోని క‌ర్నూలు జిల్లా, నంద్యాల రైల్వే స్టేష‌న్ ద‌రి పోస్టాఫీసు స‌మీపంలోని గ‌ణేషుని విగ్ర‌హాన్ని దుండ‌గులు విర‌గ్గొట్టారు. మొన్న శ్రీ‌కాకుళం జిల్లా, పాత‌ప‌ట్నంలోని జ‌రిగిన సంఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే క‌ర్నూలులోని హిందూ దేవుడి విగ్ర‌హాన్ని బుధ‌వారం రాత్రి ప‌గ‌ల‌గొట్ట‌డ‌డంపై భ‌క్తులు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలోని ప్ర‌భుత్వం ఉందా? లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు అదుపుత‌ప్ప‌డం వ‌ల్లే ఇటువంటి దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు.
హిందూ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేందుకే కొంత‌మంది ప‌నిగ‌ట్టుకొని ఇటువంటి చ‌ర్యల‌కు పూనుకొంటున్నార‌ని, దుండ‌గుల‌ను త‌క్ష‌ణం అరెస్టు చేయాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి