News

భుజం… భుజం… క‌లిపి వంతెన నిర్మించి…

569views

తిరువ‌నంత‌పురం: ప్రకృతి బీభ‌త్సానికి కేర‌ళ అత‌లాకుత‌ల‌మైంది. రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్ళు ధ్వంస‌మ‌య్యాయి. వీటితోపాటు కొక్కర్ పంచాయతీలను కలిపే తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఈ సంఘ‌ట‌న‌తో ఆయా గ్రామాల మ‌ధ్య సంబంధాలు తెగిపోయాయి.

స‌మాచారం తెలుసుకున్న రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ అనుబంధ సంస్థ సేవాభార‌తి కార్య‌క‌ర్త‌ల హృద‌యం ద్ర‌వించించింది. తాత్కాలిక వంతెన నిర్మించాల‌ని సంక‌ల్పించారు. వెంట‌నే స్థానికుల‌ను క‌లిసి, స‌మిష్టిగా వంతెన నిర్మించారు. వీరి సేవ‌ల‌ను ప‌లువురు అభినందించారు.

 

Source: Sevabharathi, Kerala

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి