
647views
న్యూఢిల్లీ: చైనా నూతన జాతీయ సరిహద్దు చట్టాన్ని తీసుకొచ్చింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటు పడనున్నట్టు తెలిపింది. సరిహద్దుల్లో ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్టు వెల్లడించింది.
చైనా తీసుకొచ్చిన తాజా చట్టం భారత్‌తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. భారత్, భూటాన్ దేశాలతో చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. భారత్‌తో 3,488 కిలోమీటర్లు, భూటాన్‌తో 400 కి.మీ మేర సరిహద్దు వివాదాస్పదంగా ఉంది.





