News

దేశ‌ద్రోహి… ఆ ముస్లిం కానిస్టేబుల్‌!

352views
  • పాక్‌కు భారత రహస్య సమాచారం అంద‌జేత‌

  • ఉగ్రవాద నిరోధక దళం అదుపులో నిందితుడు

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్​ భుజ్​ బెటాలియన్​కు చెందిన సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్​ను గుజరాత్​ ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. పాకిస్థాన్​కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడిని జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాకు చెందిన మహమ్మద్​ సజ్జద్​గా అధికారులు గుర్తించారు. భుజ్​లోని బీఎస్​ఎఫ్​ 74వ బెటాలియన్​లో ఈ ఏడాది జులైలో అతడు నియమితుడయ్యాడని చెప్పారు.

వాట్సాప్​ ద్వారా రహస్య సమాచారాన్ని సజ్జద్​.. పాక్​కు చేరవేశాడని ఏటీఎస్​ తెలిపింది. అంతేగాకుండా తప్పుడు జన్మ ధ్రువీకరణ పత్రం సమర్పించి బీఎస్​ఎఫ్​ను తప్పుదోవ పట్టించాడని పేర్కొంది. ఆధార్​ కార్డు ప్రకారం సజ్జద్​ 1992 జనవరి 1న జన్మించినట్టు ఉండగా.. పాస్​పోర్టు ప్రకారం అతడు 1985 జనవరి 30న పుట్టినట్లుగా ఉందని పేర్కొంది. సజ్జద్ వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, వాటి సిమ్​కార్డులతో పాటు, మరో రెండు సిమ్​కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఏటీఎస్ అధికారులు​ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి