
432views
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మూడు రోజులుగా ఎడతెగని వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఫలితంగా ఇప్పటి వరకు 47 మందికి పైగా పౌరులు మృతిచెందారు. మంగళవారం ఒక్కరోజే 42 మంది దుర్మరణం పాలయ్యారు. వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్డు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయి. వంతెనలు కూలిపోయాయి.
భారత వాయుసేన హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ మంత్రి ధన్‌సింగ్ రావత్, డీజీపీ అశోక్ కుమార్‌లతో కలిసి ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ ఏరియల్ సర్వే నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా పంట నష్టాలను అంచనా వేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. మరణించినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.





