News

ఇంఫాల్‌లో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం, ఇద్ద‌రి ముస్లింల అరెస్ట్‌

681views

ఇంఫాల్: మాదకద్రవ్యాల వినియోగం, ర‌వాణాపై మణిపూర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తాజాగా, ఇంఫాల్ ఈస్ట్‌లో సోమవారం భారీగా డ్రగ్స్ రికవరీ చేశారు. ఇద్దరు పెడ్లర్‌లను అరెస్టు చేశారు. మణిపూర్ ప్రభుత్వం ‘డ్రగ్స్‌పై యుద్ధం’ పేరిట గొప్ప కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఫ‌లితంగా ఎక్క‌డిక‌క్క‌డే డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డుతున్నాయి. కాగా, స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ .60 లక్షల ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.

ఇంఫాల్ ఈస్ట్‌లోని హత్తా గోలపాటి వద్ద ఇద్దరు డ్రగ్స్ విక్రయదారులు అయాజుద్దీన్ చెమ్సా(37), ఎండీ అబ్దుల్లా ఖాన్‌(27)లను హెరాయిన్ పౌడర్‌తో పాటు అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుల‌ను, డ్ర‌గ్స్‌ను తదుపరి విచారణ కోసం పోరంపట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. నిందితుల‌కు దేశవ్యాప్తంగా డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయ‌ని పోలీసులు తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి