News

ఇజ్రాయెల్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన

615views
  • క్వాడ్ కూటమి ఏర్పాటు దిశగా కసరత్తు

జెరూసలేం: పశ్చిమాసియాలో భారత ప్రాభవాన్ని ద్విగుణీకృతం చేసేలా నూతన చతుర్భుజ కూటమి అవతరిస్తోంది. ఆ మేరకు కీలక పరిణామాల సమాహారంగా భారత విదేశాంగ శాఖామంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇజ్రాయెల్‌ పర్యటన ఫలవంతమవుతోంది. ఇజ్రాయేలీ మంత్రి యూయిర్‌ లాపిడ్‌తో కలిసి అమెరికా, యూఏఈ మంత్రులు ఆంటొనీ బ్లింకెన్‌, అబ్దుల్లా బిన్‌ జాయేద్‌లతో వర్చువల్‌గా సమావేశమైన జైశంకర్‌- ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ రాజకీయాల్లో పరస్పర సహకారంపై చర్చలు సాగించారు.

వాతావరణ మార్పులు, ఇంధన సహకారం, సముద్ర భద్రతలపై దృష్టిసారించిన ఆ నలుగురు- ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ దిశగా సమష్టి కృషికి పిలుపిచ్చారు. అంతకు మునుపు యూయిర్‌ లాపిడ్‌తో జైశంకర్‌ భేటీలో ప్రధానాంశాలెన్నో చర్చకు వచ్చాయి. పదేళ్లుగా సంప్రదింపుల దశలోనే మగ్గిపోతున్న స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని 2022 జూన్‌కల్లా కొలిక్కి తీసుకురావాలన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి