
567views
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. 75 జిల్లాల్లోని 75వేల మంది లబ్ధిదారులకు ఇళ్లను డిజిటల్ వేదికగా ప్రారంభించనున్నారు. అనంతరం వారితో వర్చువల్ సమావేశం నిర్వహిస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఏ75 న్యూ అర్బన్ ఇండియా కార్యక్రమాన్ని లఖ్‌నవూలో ప్రారంభించనున్నారు మోదీ. అక్టోబరు 5-7వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో అన్నిరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొననున్నాయి. స్మార్ట్ సిటీస్ పథకం కింద 75 పట్టణ ప్రాంత ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్టు ప్రధానమంత్రిత్వ కార్యాలయం పేర్కొంది.





