
555views
బెంగళూరు: కంబళ పరుగు పోటీల్లో దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని పక్కనపెట్టి తొలిసారి ఈ ఏడాది పోటీల్లో యువతులు పాల్గొననున్నారు. దక్షిణ కర్ణాటకలోని తుళునాడులో ఈ ఏడాది నిర్వహించే కంబళ పోటీల్లో ఐదుగురు అమ్మాయిలు బరిలోకి దిగుతున్నారు. గతేడాది.. కుందాపురక్‌కు చెందిన ఛైత్ర పరమేశ్వర్ భట్ తొలిసారిగా కంబళ పోటీల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. అయితే, ఈ ఏడాది ఛైత్రతో పాటు మరో నలుగురు యువతులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం వీరు శిక్షణలో ఉన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





