
437views
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలపై రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అయితే.. చట్టాలపై ఉన్న అభ్యంతరాలను తెలపాలన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యను హింస ద్వారా కాక శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిరసనకారులకు సూచించారు.





