News

ప్రాథమిక పాఠశాలల్లోనూ భోజనం

544views
  • ప్రధాని పోషన్‌ అభియాన్‌గా పేరు మార్పు

  • కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమలవుతున్న ప్రభుత్వ పాఠశాల్లో ఇప్పటికే అమలవుతున్నర మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాలల్లో నడుస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు (3-6 ఏళ్ల పిల్లలకు) కూడా ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ప్రధానమంత్రి-పోషణ్‌ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో నర్సరీ, కేజీ, యూకేజీ విద్యార్థులకు కూడా పోషకాహారం లభించనుంది.

చిన్న పిల్లలకు సైతం పోషక ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడిరచారు. ఇప్పటివరకు ఉన్న జాతీయ మధ్యాహ్న భోజన పథకం పేరును ప్రధానమంత్రి పోషణ్‌ పథకంగా మారుస్తున్నట్లు వెల్లడిరచారు. దాదాపు 24 లక్షలమందికి పైగా ప్రీ-ప్రైమరీ విద్యార్థులను కూడా ఈ స్కీమ్‌లో భాగం చేస్తున్నట్లు వెల్లడిరచారు. అంతకుముందు మధ్యాహ్న భోజన పథకం కింద ఒకటోతరగతి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు పోషకాహారం అందించేవారు. ఈ నిర్ణయంతో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా పోషకాహారం లభించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి