News

చైనాలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం

490views

బీజింగ్‌: చైనాకు ఇప్పుడు కరెంటు కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా నుంచి బయటపడుతూ అన్ని రంగాలు తెరుచుకుంటున్న తరుణంలో కరెంట్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరిగిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్ప‌డింది. వాణిజ్య పరమైన విద్యుత్‌ వినియోగం పెరగడంతో చివరకు వీధిలైట్లకు కూడా విద్యుత్‌ నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

డిమాండ్‌కు తగినంతగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో దాని ప్రభావం ఉత్పత్తి రంగంపై కనిపించే అవకాశం ఉంది. చైనాలో ఉత్పత్తి రంగం కుదేలైతే దాని ప్రభావం ఆ ఒక్కదేశంలో మాత్రమే కాకుండా, యూరప్‌, ఆఫ్రికా ఖండాల్లోని అనేక దేశాలపై ఎక్కువగా, ఇతర దేశాలపై ఎంతోకంత లేకపోలేదు. కొద్ది దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదిగిన చైనా ఇప్పుడు ప్రపంచ కర్మాగారంగా పేరొందింది. దీంతో ఇక్కడ ఏ సమస్య తలెత్తినా అది ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి