
638views
-
ఉగ్రవాదులను మట్టుబెడుతున్న భద్రత దళాలు
కశ్మీర్: జమ్ము-కశ్మీర్‌లో షోపియన్ జిల్లా కష్వా గ్రామంలో ముష్కరులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుడి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కష్వాలో ఉగ్రవాది ఉన్నట్టు తమకు సమాచారం అందిందని అధికారులు చెప్పారు.
ఇందుకు సంబంధించి గాలింపు చర్యల్లో మిలిటెంట్‌ను గుర్తించామని.. లొంగిపోయేందుకు అవకాశం కల్పించినా తమపై కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ స్థానికుడు గాయపడ్డాడని తెలిపారు. ముష్కరుడు.. అనాయర్ ఆష్రఫ్ దార్‌గా గుర్తించినట్టు వెల్లడిరచారు. నిందితుడిపైన ఇప్పటికే డ్రగ్స్ రవాణా, తీవ్రవాదులకు ఆయుధాల పంపిణీ తదితర కేసులు నమోదయ్యాయని చెప్పారు.





