News

అమెరికాలో మోడీకి ఘన స్వాగతం

523views

వాషింగ్టన్​: క్వాడ్​ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్​లోని జాయింట్​ బేస్​ ఆండ్రూస్​ విమానాశ్రయం​లో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​ సందు.. విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు.

అమెరికా అధికారులు.. ఆర్మీ బ్రిగేడియర్​ అనూప్​ సింగాల్​, ఎయిర్​ కమాండర్​ అంజన్​ భద్ర, నౌకాదళ కమాండర్​ నిర్భయా బప్నా, అమెరికా విదేశాంగ శాఖలోని మేనేజ్​మెంట్​, వనరుల విభాగం డిప్యూటీ టీహెచ్​ బ్రియాన్​ మెక్​కియాన్​లు.. హాజరయ్యారు. చిరుజల్లులు కురుస్తున్నా.. మోదీ రాకకోసం వందల మంది ప్రవాస భారతీయులు విమానాశ్రయానికి వచ్చారు. మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. వారిని మోడీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి