News

ముస్లింల నుండి సర్కారు భూములకు విముక్తి!

533views
  • అక్రమంగా 1488 ఎకరాల్లో తిష్ఠ

  • పదేపదే నోటీసులు ఇచ్చినా స్పందన శూన్యం

  • కట్టడాలు తొలగించిన అధికార యంత్రాంగం

గౌహతి: ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను తొలగించే దిశగా అసొం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దరాంగ్‌ జిల్లాలో జిల్లా యంత్రాంగం దాదాపు 1488 ఎకరాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి, ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ కార్యక్రమానికి యంత్రాంగం పోలీసులు, పారామిలిటరీ దళాల సహాయం తీసుకుంది. ‘4,500 బిగాల(బిగా అంటే భూమి కొలవడానికి వాడే పదం) ప్రభుత్వ భూమిని 800 వలస ముస్లిం కుటుంబాలు ఆక్రమించాయి. ఇది చట్టవిరుద్ధంగా జరిగింది.

ఏళ్ళ తరబడి ఆ భూముల్లో ముస్లింలు తిష్ఠ వేశారు. అధికారులు పదేపదే నోటీసు ఇచ్చిన తర్వాత కూడా ఖాళీ చేయలేదు. దీంతోనే ప్రత్యేక చర్య తీసుకోవాల్సి వచ్చింది’ అని ఒక ఉన్నతాధికారి తెలిపారు. సిపజార్‌ నియోజకవర్గం పరిధిలోని దరాంగ్‌ జిల్లాలోని ధల్పూర్‌ ప్రాంతంలో ఈ తొలగింపు కార్యక్రమం జరిగింది. ఇదిలావుండగా, దల్పూర్‌ ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్న మరో 300 కుటుంబాలు గౌహతి హైకోర్టును ఆశ్రయించాయి. వీరు దాదాపు 9000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అధికార వర్గాలు తెలిపాయి.

గోరుఖుతి వ్యవసాయ ప్రాజెక్ట్‌

ఈ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం మెగా వ్యవసాయ ప్రాజెక్టును కట్టనుంది. ‘గోరుఖుతి వ్యవసాయ ప్రాజెక్ట్‌’ అని పేరు పెట్టబడిన ఈ ప్రాజెక్ట్‌ స్థానిక యువతను లాభదాయకమైన వ్యవసాయ వ్యాపారాలలో నిమగ్నం చేస్తుంది. ఎమ్మెల్యే పద్మ హజారికా నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 500 మంది బాలబాలికలకు శిక్షణ ఇచ్చింది. వారు గోరుఖుతి అగ్రి ప్రాజెక్ట్‌ కింద తొలగించబడిన భూముల్లో వ్యవసాయం ప్రారంభిస్తారు.

ఆక్రమణల తొలగింపు ప్రక్రియను అధికారులు ఆరు జోన్లగా విభజించారు. కానీ కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు. ఇంకా, ఈ ప్రత్యేక చర్యలు అన్ని ప్రదేశాలలో నిర్వహించలేదు. గోరుఖుతి ప్రాంతంలో ఇప్పటికే 500 మంది యువకులు పని ప్రారంభించారు. దాదాపు 30 ట్రాక్టర్లు దున్నడం పనిని ప్రారంభించాయి. గోరుఖుతి ప్రాజెక్ట్‌ త్వరలో ప్రారంభమవుతుంది.

ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంది…

గోరుఖుటి వ్యవసాయ ప్రాజెక్టు సమన్వయకర్త ఎమ్మెల్యే పద్మ హజారిక మాట్లాడుతూ ఇప్పటివరకు 7,000 బిగాల భూములు ఆక్రమణ నుండి స్వాధీనం చేసుకుందని చెప్పారు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక యువతతో కూడిన వ్యవస్థీకృత వ్యవసాయ విప్లవాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.

Source: VskBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి