News

బెదిరించి, సరుకులు పట్టుకుపోయిన మావోలు

426views

కోడంచెరి: కేరళలోని కోజికోడ్‌ జిల్లా, కోడంచెరి పంచాయతీలోని వట్టచిరా అటవీ కాలనీలో సాయుధ మావోయిస్టులు ప్రజలను బెదిరించి ఆహార పదార్థాలను తీసుకెళ్లారని ఫిర్యాదు నమోదైంది. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం… 16వ తేదీ రాత్రి మావోయిస్టులు ఊర్లోకి వచ్చారు. అయితే, భయం కారణంగా ఎవరూ బయటకు రాలేదు. వట్టచిరా అటవీప్రాంతం, నిరట్టుకున్ను సమీపంలోని సురేష్‌ ఇంటికి చేరుకున్నారు.

ఆ కుటుంబాన్ని బెదిరించి బియ్యం, టమోటాలను తీసుకువెళ్ళిపోయారు. ఆ రోజు ఆ బృందం రెండుసార్లు గ్రామానికి వచ్చింది. కాలనీవాసుల సమస్యలు, మంచినీటి సమస్యల గురించి అడిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మావో బృందంలో జయన్న, కోట హోండా రవి, సంతోష్‌ ఉన్నట్టు స్థానికులు అందజేసిన ఆధారాల బట్టి పోలీసులు గుర్తించారు.

Source: Janamonline

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి