News

టీకాల సరఫరాపై భార‌త్‌కు ఐరాస ప్రశంసలు

569views

ఐక్య‌రాజ్య‌స‌మితి: ప్రపంచదేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకా అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ అంశం దోహదపడుతుందని తెలిపింది. ఈ మేరకు భారత వైద్య, ఆరోగ్య మంత్రి మాన్సుఖ్​ మాండవియాకు డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్​ గెబ్రెయెసస్ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి