
514views
-
యూపీ భాజపా ఎమ్మెల్యే హామీ..
లక్నో: మసీదుల నిర్మాణానికి కూల్చివేసిన అన్ని దేవాలయాలను భారతీయ జనతా పార్టీ పునర్నిర్మిస్తుందని మీరట్ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అన్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ‘కాలానుగుణ హిందువు’ అని సోమ్ ఆరోపించారు.
గత నాలుగున్నర ఏళ్ళల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో సోమ్ ప్రసంగించారు. భక్తులపై కాల్పులకు ఆదేశించిన వ్యక్తులు ఇప్పుడు దేవాలయాల నిర్మాణం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హిందుస్థాన్ హిందువులకు చెందినదని.. ముస్లింలు కూడా హిందువులేనని ఆయన పేర్కొన్నారు.





