
-
సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్రం
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో మహిళలకు ప్రవేశం కల్పించడానికి త్రివిధ దళాల అధిపతులు అంగీకరించినట్టు కేంద్రం ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. మహిళలు ఎన్డీఏ కోర్సులు అభ్యసించేలా మార్గదర్శకాలను రూపొందించడానికి కొంత సమయం అవసరమని పేర్కొంది. ఎన్డీఏ పరీక్షలకు మహిళలను అనుమతించకపోవడంపై సుప్రీం కోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో కోర్టు మహిళలను ఎన్‌డీఏ పరీక్షకు అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుసరిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, బుధవారం కోర్టుకు వివరణ ఇస్తూ…. ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఇవ్వాలని కేంద్రం, త్రివిధ దళాలు అంగీకరించాయి. దీనికి సంబంధించిన పూర్తి అఫిడవిట్‌ని అందజేస్తాం’ అని ధర్మాసనానికి తెలిపారు.





