News

ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని గుర్తించాలంటూ ఐరాసకు తాలిబన్ల లేఖ

428views

కాబుల్‌: ఆఫ్ఘానిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ దేశాల గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో ప్రపంచదేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆటోనియో గుటెరస్​కు రాసిన ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. దోహాలోని తమ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ను ఐరాసలో అఫ్గాన్‌ ప్రతినిధిగా ప్రతిపాదించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి