News

24న మోడీ, జోబైడెన్ సమావేశం

449views

వైట్ హౌస్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. ఈ నెల 24 (శుక్రవారం) ఇరు దేశాల అధినేతలు శ్వేతసౌధంలో సమావేశం కానున్నారు. క్వాడ్ దేశాల స‌ద‌స్సు సంద‌ర్భంగా రెండు దేశాల నేతలు భేటీ అవుతారని వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది.

ప్రధాని మోదీ యూఎస్‌ పర్యటన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఆఫ్ఘనిస్తాన్‌ పరిస్థితులు, కొవిడ్‌ వ్యాక్సిన్‌.. తదితర విషయాలు చర్చించే అవకాశం ఉంది. అదే రోజు జరిగే.. క్వాడ్‌ కూటమి సదస్సులో ప్రధాని మోదీ, బైడెన్‌, జపాన్‌ ప్రధాని సుగా యోషిహిడే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ పాల్గొననున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి