
618views
విశాఖ: విశాఖపట్నం నుంచి 30 బోట్లతో చేపల వేటకు వెళ్ళిన ఇక్కడి మత్స్యకారులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒడిశా తీరంలో చిక్కుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విశాఖ మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
అలాగే ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైన వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. గంజాం పోర్ట్‌లోకి 17 బోట్లను అనుమతించింది. మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల మత్స్యకారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
Source: EtvBharat





