News

తీరు మారని జిత్తులమారి పాక్‌!

89views

ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదానికి అత్తారిల్లుగా ఉన్న జిత్తులమారి పాకిస్తాన్‌ నైజం మారలేదు. ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతుంటే, అవేవీ పట్టించుకోకుండా హిందుస్తాన్‌పై పడి, పసలేని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ‘శాంతి, సంస్కృతి’పై ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 75వ సెషన్‌లో ఇదే జరిగింది. పాకిస్థాన్‌ శాశ్వత ప్రతినిధి మునీర్‌ అక్రమ్‌ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ హాలులో మంగళవారం భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలకు భారత దౌత్యవేత్త విదిషా మైత్రా ఘాటుగా స్పందించారు.
హింస సంస్కృతే పాకిస్తాన్‌ నైజమని, భారతదేశంపై ద్వేషపూరిత ప్రసంగం కోసం ఐక్యరాజ్యసమితి వేదికను ఉపయోగించుకునేందుకు పాకిస్తాన్‌ ప్రతినిధి బృందం చేసిన మరో ప్రయత్నాన్ని మేము ఈ రోజు చూశాము… ఈ వైఖరి ఆ దేశంలోన, వెలుపల హింస సంస్కృతిని ప్రేరేపిస్తుంది… అటువంటి ప్రయత్నాలన్నింటినీ మేము తోసిపుచ్చి, ఖండిస్తున్నాం..’ అని యుఎన్‌ వేదికపై మైత్రా గట్టిగా మాట్లాడారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి