![](https://vskandhra.org/wp-content/uploads/2021/09/mp.jpg)
511views
కోల్‌కతా: మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ‘హింస’ కొనసాగుతోంది. ముఖ్యంగా దేశభక్తులపై నేరగాళ్ళు కన్నేశారు. తాజాగా, బీజేపీ ఎంపీ ఇంటి బయట మూడు నాటు బాంబులు పేలిన ఘటన కలకలం రేపింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి సమీపంలో మంగళవారం రాత్రి నాటు బాంబులు పేలాయి. ఆ సమయంలో ఎంపీ అర్జున్ సింగ్ ఆ ఇంట్లో లేరు. ఢల్లీిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం.
బాంబు పేలుళ్ళ శబ్దంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దర్యాప్తు చేస్తున్నారు.
Source: News 18