
ట్విట్టర్‌కు కేంద్రానికి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు దేశీ సోషల్ మీడియా నెట్ వర్క్ ‘కూ’ కు వరంగా మారింది. కూ’ ను ప్రారంభించిన కేవలం 16 నెలల కాలంలో 10మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుందని సోషల్ మీడియా స్టాటిటిక్స్ సెన్సార్ టవర్ తెలిపింది.
కేంద్రం – ట్విట్టర్‌ల వివాదం కూ’ కు ప్లస్ అయ్యింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర స్థానిక భాషల్లో ఆపరేట్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన ఈ నెట్ వర్క్ ను 85శాతం మంది యూజర్లు వినియోగిస్తున్నారు. ట్విట్టర్ యూజర్లు కాస్త దాన్ని వదిలేసి ‘కూ’ ను వినియోగించేందుకు క్యూ కడుతున్నారు.వారిలో మంత్రులు,బాలీవుడ్ సెలబ్రిటీస్, క్రికెటర్లతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలూ ఉన్నారు. ఈ సందర్భంగా కూ కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ స్థానిక భాషాల్లో దేశీ యాప్ ను వినియోగించేలా డెవలప్ చేశామన్నారు. త్వరలోనే సౌత్ ఈస్ట్ ఏసియన్ కంట్రీస్, ఈస్ట్రన్ యూరప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.





