News

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి కశ్మీర్ నుండి 60 మంది యువకులు అదృశ్యమయ్యారనే వార్తలను ఖండించిన కాశ్మీర్ పోలీసులు

515views

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 60 మంది యువకులు కశ్మీర్ నుండి అదృశ్యమయ్యారనే వార్తలను కాశ్మీర్ పోలీసులు ఖండించారు.

కాశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాల నుండి 60 మంది యువకులు తాలిబాన్ లు ఆఫ్ఘనిస్తాన్ ‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి కనిపించకుండా పోయారనే వార్తలు నిరాధారమైనవని ఆమేరకు సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం నడుస్తున్నదని కాశ్మీర్ ఐజిపి విజయ్ కుమార్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

గత రెండు నెలల్లో 60 మంది యువకులు తమ ఇళ్ల నుంచి అదృశ్యమయ్యారని ఐజీపీ పేర్కొన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. కానీ అవేవీ నిజం కాదని ప్రస్తుతం కాశ్మీర్ పోలీసులు స్పష్టతనిచ్చారు.

Source: OPINDIA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.