News

ఆఫ్ఘనిస్థాన్ కి చెందిన హిందువులు మరియు సిక్కులను కూడా భారత్ కు తీసుకువస్తాం – హోమ్ శాఖ సహాయ మంత్రి

665views

ఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ ఆఫ్ఘన్ జాతీయులైన హిందువులు మరియు సిక్కులతో సహా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు.

హాజీపూర్ ‌లో జరిగిన ఒక బిజెపి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆఫ్ఘనిస్థాన్ దేశం నుండి భారతీయులందరినీ సురక్షితంగా తిరిగి భారత్ కు తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ – వీసా కు అవకాశమిచ్చిన కేవలం మూడు గంటల్లో 1100 కి పైగా దరఖాస్తులను భారత ప్రభుత్వం అందుకున్నదని ఆయన తెలిపారు.

అంతకుముందు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, భారత ప్రభుత్వం తన పౌరులను ఆఫ్ఘనిస్తాన్ నుండి వారి ఇళ్లకు తప్పక తిరిగి తీసుకువస్తుందని, వందే భారత్ మిషన్‌లో చేసినట్లుగానే, వాయు మార్గంలో వారిని భారత్ కు తప్పక తరలిస్తామని ఆయన అన్నారు.

“ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ భారత్ కు తిరిగి తీసుకురావడానికి మేము ఏమాత్రం వెనుకంజ వేయం. మాకు గహంలో వందే భారత్ మిషన్ లో పనిచేసిన అనుభవం కూడా ఇప్పుడు ఉపకరిస్తుంది. అని పౌర విమానయాన శాఖా మంత్రి శ్రీ సింధియా తెలిపారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.