News

కోచిలో మాదకద్రవ్యాల రాకెట్ గుట్టు రట్టు – కోటి రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం – 7 గురు నిందితులు అరెస్టు

483views

కేరళలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. కోటి రూపాయల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలు సహా 7 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన డ్రగ్ మాఫియా సభ్యులు ముహమ్మద్ అజ్మల్, ఫైసల్, ముహమ్మద్ ఫాబాజ్, ముహమ్మద్ అఫ్సల్, తైబా, షమన్ మరియు శ్రీమోన్ లు. కొచ్చిలోని ఒక ఫ్లాట్ లో నుంచి వీరు మాదకద్రవ్యాల వ్యాపారం కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.

మాదకద్రవ్యాల వ్యాపారం గురించి సమాచారం అందుకున్న తరువాత, కస్టమ్స్ ప్రివెంటివ్ వింగ్ మరియు కాక్కనాడు ఎక్సైజ్ శాఖలు కోచిలోని ఫ్లాట్‌లో సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఏడుగురిని అరెస్టు చేశాయి. అరెస్టయిన సభ్యులు తమ డ్రగ్ వ్యాపారం కోసం ఐ 20 కారును ఉపయోగించారని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. వారు MDMA, LSD మరియు ఇతర మాదకద్రవ్యాలను విక్రయించారు. చెన్నై నుంచి డ్రగ్స్ తెప్పించారని నివేదిక పేర్కొంది.

ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేరళ కేంద్రంగా మారినందున, ఈ మాదకద్రవ్యాల వ్యాపారానికి ఉగ్రవాద నిధులతో ఏదైనా సంబంధమున్నదేమోనన్న విషయాన్ని మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని దర్యాప్తు సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.