అమెరికాలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. టైమ్ స్క్వేర్ లో జెండా ఎగుర వేసిన ప్రవాస భారతీయులు..

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులు త్రివర్ణ పతాకం ఎగురవేసి పండగలా జరుపుకున్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరుపుకున్న ఈ వేడుకలకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికయ్యింది. నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ఉన్న భారీ బిల్‌బోర్డ్స్ లో ఆగష్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ప్రవాసాంధ్రలు ఎగురవేశారు. అనంతరం జాతీయ జెండాకు శాల్యూట్ చేసి.. భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేశారు. వందేమాతరం ఆలపించారు. ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పోల్ 25 అడుగుల ఎత్తు ఉండగా.. భారతీయ జెండా 6 అడుగుల 10 అడుగులు ఉంది. న్యూయార్క్, న్యూజెర్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ కనెక్టికట్ టైమ్స్ స్క్వేర్‌లో త్రివర్ణ పతాకం ఎగరవేయడం ప్రారంభించారు. ఈ వేడుకలు ఆగస్టు 15 న పగటిపూట నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్‌లోని మొదటి ఇండియా డే బిల్‌బోర్డ్ లో 24 గంటల పాటు ప్రదర్శించబడుతుంది.





