456
నేడు భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయీ తృతీయ వర్ధంతి. ఆయనకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్ పేయీ స్మారకం ‘సదైవ్ అటల్’కు తరలివెళ్లారు.
ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సదైవ్ అటల్ కు చేరుకొని వాజ్ పేయీకి నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహానేత దేశానికి చేసిన సేవలను కొనియాడారు.