News

ఆగస్టు 14 “దేశవిభజన బీభత్స స్మృతి దినం” – ప్రధాని మోడీ

820views

భారత స్వాతంత్ర్య దినం ఆగస్టు 15కు ఒక రోజు ముందు ఆగస్టు 14ను ‘పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే’ (దేశ విభజన బీభత్స స్మృతి దినం)గా పాటిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

“దేశ విభజన గాయాలను ఎప్పటికీ మరిచిపోలేం. ఆ మతి లేని ద్వేషపూరిత హింసకు మన సోదర సోదరీమణులు లక్షలాది మంది బలయ్యారు. మన ప్రజల బాధలు, త్యాగాలను స్మరించుకునేందుకు ఆగస్ట్ 14ను ‘పార్టిషన్ హారర్స్ రిమెంబరన్స్ డే’ గా పాటిద్దాం” అని మోడీజీ ట్వీట్ చేశారు.

దేశ విభజన సమయంలో జరిగిన దారుణాల స్మృతి దినం సామాజిక విభజన, అసమానత అనే విషాన్ని తొలగించి ఐకమత్యం, సామాజిక సామరస్యం, మానవ సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉండాలి” అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.