News

హింస వీడితే అధికార భాగస్వామ్యం… తాలిబన్లకు ఆఫరిచ్చిన ఆఫ్ఘన్ ప్రభుత్వం

621views

తాలిబన్లు హింసకు స్వస్తి చెప్పిన పక్షంలో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తోంది. దేశంలో పోరు మానివేస్తే.. అధికారంలో మీకు ‘వాటా’ ఇస్తామని ఖతార్ లో ఆఫ్ఘన్ ప్రతినిధి ప్రకటించినట్టు ఏ ఎఫ్ పీ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను మధ్యవర్తిగా ఉన్న ఖతార్ కి సమర్పించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా కాబూల్ సమీపంలో గజినీ ప్రొవిన్షియల్ రాజధానిని తాలిబన్లు గురువారం స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 10 రాజధానులు వీరి వశమయ్యాయి. ఇలా ఉండగా ఆఫ్ఘన్ లో పరిస్థితి దిగజారుతోందని, అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి అన్నారు. కాబూల్ లోని భారతీయులను ఇండియాకు వెళ్లిపోవాలని అక్కడి భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసిందని ఆయన చెప్పారు అటు-. కుందుజ్ విమానాశ్రయంలో నిన్న ఆఫ్ఘన్ దళాలు తాలీబన్లకు లొంగిపోయినట్టు స్థానిక నేతలు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.