News

పూరి జగన్నాథ స్వామి ఆలయంలో దర్శనాలకు అనుమతి… తాజా మార్గదర్శకాలు విడుదల

498views

కరోనా కారణంగా దర్శనాలు నిలిపివేసిన పూరీ జగన్నాథుని ఆలయం ఇవాళ తెరుచుకుంది. అయితే, దేవాలయంలోకి పూర్తి స్థాయిలో భక్తులను ఈ నెల 23 నుంచి అనుమతిస్తారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా మూడు నెలలపాటు మూసివేసిన తర్వాత.. తొలి దశలో దేవాలయ సేవకులు, కుటుంబ సభ్యులకు జగన్నాథుని దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

తాజాగా భక్తుల దర్శనాలకు సంబంధించి ఆలయ అధికారులు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. జగన్నాథుడి దర్శన సమయాల్లో మార్పులు చేశారు. అన్ని రోజులూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఉంటాయి. అన్ని వారాంతాలతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి అయిన ఆగస్టు 30న, అలాగే గణేష్ చతుర్థి అయితే సెప్టెంబర్ 10 వంటి ప్రధాన పండుగలలో ఈ ఆలయం మూసివేయనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో శని, ఆదివారాల్లో ప్రభుత్వ ఆంక్షలు అమలవుతాయని…ఆ రోజుల్లో దేవాలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.