
856views
చైనాలో గత కొద్ది రోజులుగా కొవిడ్ మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. మొత్తం 17 ప్రావిన్సుల్లో అనూహ్యంగా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారిన, ప్రముఖ పర్యాటక ప్రాంతం ఝాంగ్‌జియాజీ నగరాన్ని పూర్తిగా మూసివేసింది. ప్రజలెవరినీ ఇళ్లు దాటి బయటకు రావద్దని.. నగరంలో ఉన్నవారెవరూ (పర్యాటకులు సహా) బయటకు వెళ్లరాదని ఆంక్షలు విధించింది. వైరస్ కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారులకు శిక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.
నేపాల్‌లో ఉద్ధృతి.. నేపాల్‌లోనూ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. గతంలో ఎన్నడూలేనంత రికార్డు స్థాయిలో బుధవారం 4,107 కొత్త కేసులు బయటపడ్డాయి.





