
ఏ ఈ ఎల్ సి చర్చ్ వివాదం తారస్థాయికి చేరింది.. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగనాకొడుకువి అంటూ పాస్టర్లు బండ బూతులు తిట్టుకున్నారు. ఇప్పటివరకూ పాస్టర్ల మధ్య గొడవే అనుకున్న గుంటూరు ఏ ఈ ఎల్ సీ చర్చి వివాదం ప్రస్తుతం రాజకీయ మలుపు తీసుకుంది. సరికొత్త అక్రమాల కథా చిత్రమ్ తెరపైకి వచ్చింది. చర్చి పాస్టర్లకు చెందిన ఇరువర్గాల దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఒక పాస్టర్ జాన్ కృపాకర్ కు రాజకీయ పరామర్శలు పెరగడంతో పాస్టర్ల గొడవ కాస్త రాజకీయ వివాదంగా మారింది. జాన్ కృపాకర్ ను వైసీపీ నేత గౌతమ్ రెడ్డి పరామర్శించారు.
టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అండతోనే ఓ వర్గం దాడులకు దిగుతోందని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు చర్చి వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు, బిషప్ పరదేశి కూడా వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కామెంట్స్ కు కొనసాగింపుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చి ఆస్తులు, నిధులపై కన్నేసిన టీడీపీ నేతలు ఇందులో తలదూర్చారని ఆరోపించారు. కేవలం ఆరోపణలే కాదు.. ఏకంగా చిట్టానే బయటపెట్టారు. రాయపాటి సాంబశివరావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తోపాటు పలువురు టీడీపీ నేతలకు అప్పుడు లీజులు కట్టబెట్టారని పరదేశిబాబు చెప్పుకొచ్చారు. ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా… చర్చి ఆస్తులపై కన్నేస్తుంటారని, ఇప్పుడూ అదే జరుగుతోందని అన్నారు. లీజు పేరుతో చర్చి ఆస్తులను కాజేసేందుకు దిగజారి ప్రవర్తిస్తున్నారని జేడీ అన్నారు. పాస్టర్ల మధ్య రచ్చ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో చర్చిలో జరిగిన అక్రమాలు బయటికి వస్తున్నాయి. లీజుల్లో లొసుగులు, నిధుల గోల్ మాల్ పై ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు. ఇలా ఎన్ని అక్రమాలు బయటకు వస్తాయో చూడాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.





