NewsSeva

చెంచు గూడాలలో సంఘమిత్ర సేవా సమితి దుస్తుల పంపిణీ

464views

ర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి దత్తత తీసుకున్న 40 చెంచు గూండాలలో మొబైల్ మెడికల్ వ్యాన్ సహాయంతో నిరంతర వైద్య సహాయం అందించడంతో పాటు, అవసరానికనుగుణంగా, వర్షా కాలం దోమలు, చలినుండి వారిని వారు కాపాడు కోవటానికి దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేయడం జరిగింది.

బలపాల తిప్పి, పాత మాడుగుల, యర్రమఠం,శివపురం తదితర చెంచు గూడాలలో చీరలు, ప్యాంట్లు, చొక్కాలు, చిన్న పిల్లల దుస్తులు, దుప్పట్లు మొదలైన దుస్తులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరి శ్రీనివాస్ విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ రాంప్రసాద్ ,భక్త కన్నప్ప గురుకులం ఆవాస ప్రముఖ్ శ్రీ రామకృష్ణ , శ్రీ చాంద్ బాషా లతోపాటు జనాల గూడెం శ్రీ సుధాకర్ బలపాల తిప్ప శ్రీ విజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘమిత్ర సేవలను కొనియాడారు.

అంతరించి పోతున్న జాతులు జాబితాలో ఉన్న ఈ అడవి బిడ్డలను కాపాడు కోవడం ప్రతి భారతీయుని బాధ్యత. ఈ భూమి పుత్రులు కాపాడబడితే, అటవీ సంపద, వన్యప్రాణులు, పర్యావరణం కాపాడబడడం మాత్రమే కాదు, నక్సలిజం కూడా అరికట్ట బడుతుంది. నిరంతర, పవిత్ర మానవతా భావనతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘమిత్ర సేవా సమితి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించ దలచిన వధాన్యులు సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ ( +919441280001) ని సంప్రదించవలసిందిగా సంఘమిత్ర సేవా సమితి తెలియజేస్తున్నది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.