News

ఆ రెండు తేదీలలో హిందూ దేవాలయాలపై దాడులు జరగొచ్చు : నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలలో హై అలర్ట్

781views

మ్మూ కాశ్మీర్ లో ప్రశాంతతను దెబ్బ తీయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. తీవ్రవాదులకు మద్దతును ఇస్తూ, వారిని రెచ్చగొడుతూనే ఉంది. ఈ ఆగస్టు 5కి ఆర్టికల్ 370 ను రద్దు చేసిన రెండవ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఎ-తైబా, జైష్-ఇ-మొహమ్మద్ లు జమ్మూ కాశ్మీర్‌లోని హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడవచ్చని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి. ఆగస్టు 5 న మరియు స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 న హిందూ దేవాలయాలపై తీవ్రవాదులు దాడి చేసే అవకాశమున్నదని నిఘా వర్గాల సమాచారం. దీంతో జమ్మూ కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో సెక్యూరిటీని మరింత పెంచారు. ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

సాంబా జిల్లాలో గ‌త‌ రాత్రి ఏకంగా మూడు ప్రాంతాల్లో డ్రోన్లు సంచ‌రించాయి. తొలి డ్రోన్ ‌ను బారి బ్ర‌హ్మ ప్రాంతంలో, రెండో డ్రోన్ ను చ‌లియారి వ‌ద్ద గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. కొద్దిసేపటికి గ‌గ్వాల్ ప్రాంతంలో మూడో డ్రోన్ ను గుర్తించారు. వాటిపై కాల్పులు జ‌ర‌ప‌డంతో వెనక్కు వెళ్లిపోయాయి. డ్రోన్లు సంచ‌రించిన ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీలు చేపట్టాయి. డ్రోన్ల సంచారంతో సాంబా జిల్లాలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

ఆగస్టు 5న డ్రోన్లతో దాడి జరిగే అవకాశం ఉందని, ఢిల్లీలో కూడా దాడి చేయడానికి పెద్ద ఎత్తున తీవ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ ఉగ్రదాడి జరగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. ఆగస్టు 15 కు ముందే దాడి జరగొచ్చని ఢిల్లీ పోలీసులకు భద్రతా సంస్థల నుండి సమాచారం అందింది. డ్రోన్ దాడి జరగొచ్చని భద్రతా సంస్థలు హెచ్చరికను జారీ చేశాయి. ఆగస్టు 5 న ఉగ్రదాడికి అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. అదే రోజున డ్రోన్ దాడి చెయ్యడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని ఏజెన్సీలు హెచ్చరించాయి. భద్రతా సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం, పాక్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్లను ఉపయోగించి ఉగ్ర దాడులు చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ మద్దతు ఉన్న టెర్రర్ గ్రూపులు ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా భంగం కలిగించవచ్చని భద్రతా సంస్థలు తెలిపాయి. ఇటీవల పాకిస్తాన్ లో పట్టుబడిన డ్రోన్ కు కూడా పేలుడు పదార్థాలు కట్టి ఉన్న విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా తీవ్రవాదులు ప్లాన్ చేసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు.

Source : NATIONALIST HUB

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.