NewsProgrammsSeva

కరోనా బాధిత దివ్యాంగులకు సక్షమ్ చేయూత

268views

రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడిన దివ్యాంగులకు సక్షమ్ సంస్థ పలు విధాలుగా చేదోడుగా నిలుస్తోంది.

విజయవాడ సమీపంలోని కొటికలపూడి గ్రామంలో దివ్యాంగులు ఉన్న 30 కుటుంబాలకు సక్షమ్ రేషన్ కిట్లు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి అఖిలభారత అధ్యక్షులు డాక్టర్ మురళీ కృష్ణ, సక్షమ్ ప్రాంత కార్యదర్శి శ్రీ సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.

విజయవాడలోని మధురానగర్ కు చెందిన 50 కుటుంబాలకు, కండ్రిగ, పాయకాపురంలకు చెందిన మరో 50 కుటుంబాలకు ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కారిణి సభ్యులు శ్రీ కన్నా భాస్కర్, ప్రాంత సేవా ప్రముఖ శ్రీ కేశవయ్య, సప్తా ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ శరత్ బాబు, సక్షమ్ ప్రాంత కార్యదర్శి శ్రీ సత్యనారాయణ మూర్తిల చేతుల మీదుగా రేషన్ కిట్లు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నుంచి రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పారా స్పోర్ట్స్ పోటీలలో పాల్గొన్న వారికి సన్మానం కూడా జరిగింది.

అలాగే సక్షమ్ స్థాపనా దివస్ ను పురస్కరించుకుని గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలోని 50 దివ్యాంగుల కుటుంబాలకు రేషన్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సక్షమ్ కార్యదర్శి శ్రీ ప్రతాప్, సక్షమ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహ కార్యదర్శి శ్రీ విజయ రామారావు, స్థానిక కార్యకర్త శ్రీ శంభు నాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనాకి గురై ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలను సక్షమ్ అందజేస్తోంది.

కర్నూలు, నంద్యాల నగరాలలో సుమారు 70 తలసీమియా మరియు దివ్యాంగ బాధిత కుటుంబాలకు రేషన్ కిట్లు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సక్షమ్ నంద్యాల డివిజన్ అధ్యక్షులు శ్రీ నేట్ల మహేశ్వరరెడ్డి, సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరు శ్రీనివాసులు, RSS కర్నూలు విభాగ్ సంఘచాలకులు డాక్టర్ ఖాదర్ బాద్ ఉదయ శంకర్, కర్నూలు విభాగ్ కార్యవాహ శ్రీ మనోహర్, కర్నూలు జిల్లా సేవా ప్రముఖ్ శ్రీ లింగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కరోనాతో బాధపడిన దివ్యాంగ బాధితుల సహాయార్థం సక్షమ్ SCAN పేరుతో ఒక టోల్ ఫ్రీ నంబర్ ను రూపొందించి దానిద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలలో గల బాధితులకు సైతం సహాయాన్ని అందించగలిగింది.

మన రాష్ట్రంలో కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఆధారంగా చిత్తూరు జిల్లాలోని రామసముద్రం వంటి మారుమూల గ్రామాల్లోని బాధితులకు సైతం కిరాణా సరుకులు, మందులు వంటివి అందించారు.

విశాఖపట్నంలో వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న సుమారు 40 మంది దివ్యాంగులకు వాహనాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేయించడం జరిగింది.

జన సంక్షేమ సమితి, సేవా భారతి – విజయవాడ, స్మైల్ ఫౌండేషన్, రాబిన్ హుడ్ సంస్థల ఆర్థిక, హార్థిక సహకారంతోనే ఈ మొత్తం సేవా కార్యక్రమాలను నిర్వహించగలిగామని సక్షమ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీ కృష్ణమోహన్ తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.